అరకు వేలి కాంగ్రెస్ పార్టీ మహిళా మండల ప్రధాన కార్యదర్శిగా పెట్టేలి పద్మ నియామకం.
కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి క్షేత్రస్థాయిలో తీవ్రంగా పార్టీ శ్రేణులు కృషి చెయ్యాలన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు పాచిపెంట శాంతకుమారి.
అరకు నియోజకవర్గం:
అరకు వేలి మండలం 14-02-2022 ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ విస్తరణ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై, కాంగ్రెస్ పార్టీలో నూతన చేరికలు. నూతన నియామకాలు చేస్తున్న సందర్భంగా ఈరోజు అనగా 14-02-2022 సోమవారం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో అరకు వేలి మండలం, పద్మాపురం గ్రామ పంచాయతీకి చెందిన పెట్టెలి పద్మ w/o రాజు ను అరకు వేలి కాంగ్రెస్ పార్టీ మహిళా మండల ప్రధాన కార్యదర్శిగా నియామకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ పెట్టేలి పద్మ గతంలో కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను గుర్తించి తనపై నమ్మకంతో ఈ బాధ్యతను తనకు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం తీవ్రంగా కృషిచేసి మండలం నుండి పంచాయతీ, గ్రామాల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గిరిజన ప్రజల సమస్యలను పరిష్కారం చేసే దిశగా రాబోయే రోజుల్లో పాటుపడతారని పని చేస్తారని ఆకాంక్షిస్తునట్లు ఆమె స్పష్టం చేశారు.