Breaking News

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గంలో పాడేరు నుంచి నలుగురికి చోటు.

0 19

 ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన విద్యార్థుల విభాగం కన్వీనర్ గా ఎన్నికైన అంగనైని ఆనంద్.

ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఉప్పర అశోక్ కుమార్.

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గంలో పాడేరు నుంచి నలుగురికి చోటు.

ఈనెల 13వ తేదీన విజయవాడలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 40వ రాష్ట్ర మహాసభలు (ప్రతినిధి సభలు ) లో పాడేరు నుంచి నలుగురికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు లభించింది. ఈ రాష్ట్ర కార్యవర్గంలో ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన విద్యార్థుల విభాగం కన్వీనర్ గా అంగనైని ఆనంద్ ఎన్నికైయారు. ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యలుగా ఉప్పర అశోక్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా దొర రామయ్య, వంతల భగవాన్ రాజు ఎన్నికైన్నట్టు పాడేరు జిల్లా కన్వినర్ పాతుని రవికిరణ్ పాత్రుడు తెలిపారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తామని, అలాగే మా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పిన ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు. వీరికి ఏబీవీపీ జిల్లా ప్రముఖ్ ఎం.ఎం. ల్. పాత్రుడు, కళామంచ్ విభాగ్ కన్వినర్ గెమ్మెలి కళ్యాణ్, కళామంచ్ జిల్లా కన్వినర్ పూజారి కళ్యాణ్ కుమార్, తోటి విద్యార్థులు, పలువురు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.