Breaking News

బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర, జిల్లా నాయకులు సందర్శన.

0 17

 కొయ్యూరు మండలం పర్యటనలో భాగంగా కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయతీ, దూసరి కొత్తూరులో కిడ్నీ బాధితులకు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు న్యాయం చేయాలని బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు, బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు, బిజెపి అరకు జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు సందర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా మండలంలో ప్రతీ పంచాయితీలో బూత్ స్థాయిలో కమిటీలను, శక్తి కేంద్రాలలో ఇన్ ఛార్జ్ లు పటిష్టంగా కార్య క్షేత్రంలో ఉండాలని, మండల కేంద్రంలోని ప్రజల సమస్యల్ని


పరిష్కారం చేయడం కోసం కృషి చేయాలని,ఈనెల 21వ తేదీన కొయ్యూరు మండలంలో బిజెపి పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో బూత్ స్థాయి కమిటీలు, శక్తి కేంద్రాల ఇన్ ఛార్జ్ లు, బిజెపి పార్టీ తరపున పోటీ చేసిన సర్పంచులు, ఎంపిటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, క్రియాశీలక బిజెపి కార్యకర్తలు, నాయకులు విధిగా పాల్గోవాలని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మురుకుర్తి అప్పలరాజు, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మచ్చల మంగతల్లి, అరకు జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి అరిమెల రాజు, అరకు జిల్లా గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు రీమల చందరరావు, బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అర్జున్ రెడ్డి, మండల కోశాధికారి సంపరి శివకుమార్, మండల మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి లోకుల అచ్యుతావాణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.