Breaking News

నిలిచిపోయిన అంగన్వాడీ భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎంపీపీ రమేష్

0 22

 “లూసాం “అంగన్వాడి భవన నిర్మాణానికి కృషి.!

 నిలిచిపోయిన నిర్మాణాన్ని పరిశీలించిన ఎంపీపీ రమేష్.

స్థలాన్ని పరిశీలిస్తున్న ఎంపీపీ రమేష్


కొయ్యూరు మండలంలోని మర్రివాడ పంచాయితీ “లూసాం” అంగన్వాడి భవన నిర్మాణానికి కృషి చేస్తానని కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్ బాబు అన్నారు.లూసాం గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో  అంగన్వాడీభవన నిర్మాణానికి గాను పనులు ప్రారంభించి పునాది నిర్మించారు. అయితే ఇప్పటికీ భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో అంగన్వాడీ కేంద్రాన్ని తాత్కాలికంగా ఒక ఇంట్లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాన్ని సందర్శించిన ఎంపీపీ రమేష్ బాబు ఈ విషయమై విస్మయం వ్యక్తం చేస్తూ, దీనిని ఎమ్మెల్యే ఎంపీల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు బల్లా ప్రసాద్, తాతారావు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 

Leave A Reply

Your email address will not be published.