Breaking News

ఈనెల 21న అరకు వ్యాలీలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ సమావేశం.

0 18

 అరకు వేలిలో అఖిల భారత జాతీయ కేంద్ర కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు.

ఫిబ్రవరి 21న (సోమవారం) బహిరంగ సభ సమావేశాలు.

అరకు పార్లమెంట్ స్థానం పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శాంత కుమారి పిలుపు.

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కేంద్ర రాష్ట్ర కమిటీలు బలోపేతానీకై నూతన చేరికలు,డిజిటల్ సభ్యత్వ నమోదు వంటి వ్యూహాత్మక ప్రణాళికలు.

అరకు నియోజకవర్గం,అరకు వేలి మండలం తేది: 14-02-2022 AICC అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు అరకు వేలిలో అఖిల భారత జాతీయ కేంద్ర కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు వస్తున్నారని, ఈనెల ఫిబ్రవరి 21న (సోమవారం) బహిరంగ సభ సమావేశాలు నిర్వహిస్తున్నామని, అరకు పార్లమెంట్ స్థానం పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ పాచిపెంట శాంత కుమారి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల తేదీ: 21-ఫిబ్రవరి-2022 (సోమవారం) కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బహిరంగ సభ సమావేశాలు చేపడుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు R.G.P.R.S నేషనల్ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఆర్గనైజేషన్ PRO మీనాక్షి నటరాజన్.ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ మరియు AICC మెంబర్స్ మాజీ కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు, APCC వర్కింగ్ ప్రెసిడెంట్ లు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మహిళా నాయకురాలు, పాల్గొనడం జరుగుతుందని అన్నారు.

ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీల బలోపేతానీకై వ్యూహాత్మక ప్రణాళికలు, డిజిటల్ సభ్యత్వ నమోదు, నూతన చేరికలు, కమిటీల నియామకం నిర్వహించడం జరుగుతుందని కావున అరకు పార్లమెంట్ స్థానం పరిధిలోగల అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల జిల్లాల మండలాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శిలు కార్యకర్తలు నాయకులు, కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని సభను జయప్రదం చేయాలని ఆమె కోరారు.

కార్యక్రమంలో అరకు వేలి మండలం మాడగడ పంచాయతీ వంతమూరు గ్రామంలో ప్రజలు నాయకులు అభిమానులు పాల్గొనడం జరిగింది.


Leave A Reply

Your email address will not be published.