తాగునీటి కష్టాలతో అల్లాడిపోతున్న “ఒంటిపాక ” గ్రామంలో శాపంగా మారిన తాగు నీటికై ఆదివాసీ మహిళల కష్టాలు.
తక్షణమే తాగే మంచినీటి సౌకర్యం కల్పించండి మహాప్రభో.
జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తక్షణమే స్పందించాలి కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు గంజాయి భాగ్యరాజు డిమాండ్.
అరకు నియోజకవర్గం.
హుకుంపేట మండలం తేదీ: 15-02-2022 (మంగళవారం) ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు హుకుంపేట మండలం రంగశిల గ్రామపంచాయతీ పరిధిలో గల ఒంటిపాక గ్రామంలో పర్యటించిన హుకుంపేట కాంగ్రెస్ పార్టీ ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు గంజాయి భాగ్యరాజు ఆ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 150 కుటుంబాలు ఆదివాసీ ప్రజలు నివసిస్తున్న ఈ గ్రామంలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని మరి ముఖ్యంగా తాగునీటి కష్టాల్లో ఒంటిపాక గ్రామం అల్లాడి పోతుందని,ఎన్నొ సంవత్సరాలుగా తాగునీటి సమస్యతో ఆదివాసీ మహిళలు తీవ్ర ఇబ్బందులు నిత్యం పడుతున్నారని, ఈ గ్రామానికి సమీపంలో గల వ్యవసాయం నుయ్యి నీరు త్రాగడం వల్ల గ్రామస్తులు అనేక వ్యాధులు టైఫాయిడ్, పచ్చ కామెర్లు, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడుతున్నారని, వృద్ధాప్య ఆదివాసీ మహిళలు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల మంచినీరుకై చాలా దూరం ప్రయాణించిన మురుగు నోటితోనే దాహం తీసుకోవాల్సి వస్తుందని, ఈ సమస్యను ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన
చెందుతున్నారని వారు పేర్కొన్నారు. గ్రామ చుట్టు పక్కల్లో నీటి సౌకర్యం ఉన్న కానీ తాగడానికి మంచినీరు అందుబాటులో లేదని, అధికారులు స్పందించి, దృష్టి పెడితే కొళాయిల ద్వారా గ్రామంలో తక్కువ ఖర్చుతో మంచినీటి సౌకర్యం కల్పించవచ్చని, ఈ సమస్యను శాశ్వత పరిష్కారం కోసం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వారు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తక్షణమే స్పందించి ఈ గ్రామానికి శాపంగా మారిన తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, గిరిజనులు గ్రామ ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొనడం జరిగింది.