Breaking News

శిలాఫలకానికే పరిమితమైన చంపపట్టీ,సీలంగొంది,రోడ్డు బ్రిడ్జి నిర్మాణం తక్షణమే చేపట్టాలని డిమాండ్.

0 16

 శిలాఫలకానికే పరిమితమైన చంపపట్టీ,సీలంగొంది,రోడ్డు బ్రిడ్జి నిర్మాణం తక్షణమే చేపట్టాలని

స్థానిక ఎన్నికల సమయంలో బ్రిడ్జి నిర్మాణానికై ఇచ్చిన హామిని ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు గాలికొదిలేశారని

జిల్లా కలెక్టర్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి,స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు.


విశాఖ ఏజెన్సీ,అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగుడ మండలం, పోతంగి పంచాయితీ పరిధిలో గల చంపపట్టి, సీలంగొంది గ్రామానికి వెళ్ళు రోడ్డు మరియు బ్రిడ్జి నిర్మాణం తక్షణమే చేపట్టాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు.

 బుధవారం ఈ గ్రామాలను పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ డుంబ్రిగుడ నుండి చంపపట్టి,సీలంగొంది గ్రామాలకు వెళ్ళు రోడ్డు బ్రిడ్జి నిర్మాణం కేవలం శిలాఫలకానికే పరిమితమైందని,దానిని తక్షణమే నిర్మాణం చేపట్టాలని, సుమారు 25 కిలోమీటర్లు మేర రోడ్డు చాలా అస్తవ్యస్తంగా అధ్వానంగా మారిందని పెద్ద పెద్ద గుంతలతో ప్రయాణికులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని,ఆస్పత్రికి గర్భిణీ స్త్రీలు వృద్ధులు మహిళలు వెళ్లడానికి 108 వాహనం మరియు రేషన్ పంపిణీ నిమిత్తం డోర్ డెలివరీ వాహనం వెళ్ళడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారని, మారుమూల గిరిజన ప్రజలు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఆవేదన చెందుతున్నారని,రోడ్డు చాలా క్లిష్టతరంగా మారిందని, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు, ప్రమాదాలకు గురి అవుతున్నారని అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి తారు రోడ్డు సౌకర్యం కల్పించి ఆర్టీసీ బస్సు సేవలు అందించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి,డుంబ్రిగుడ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాకా సులోచన,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాల్లోరి మధ్నురావు సీనియర్ నాయకులు యువకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గిరిజన ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


Leave A Reply

Your email address will not be published.