Breaking News

గాయపడిన పూజారికి “మేమున్నాం “ఆర్థిక సాయం.

0 16

 గాయపడిన పూజారికి “మేమున్నాం “ఆర్థిక సాయం.

విశాఖ జిల్లా,కొయ్యూరు:

ఈనెల 17న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ద్విచక్రవాహనంపై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన మండలంలోని రాజేంద్రపాలెం గ్రామానికి చెందిన కొయ్యూరు కనక దుర్గ దేవి అమ్మవారి ఆలయ పూజారి వరాహగిరి కృష్ణశర్మ కు మేమున్నాం కొవిడ్-19 సేవా సంఘం ప్రతినిధి అనిశెట్టి చిరంజీవి 5000 ఆర్థిక సహాయం అందించారు.రాజమండ్రిలో ఉన్న కుమార్తెను చూడటానికి వెళ్తూ బైక్ టైర్ పంచర్ కావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో పూజారి భార్య జానకి కి కూడా స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. ఇది ఇలా ఉండగా ఈ ప్రమాద సంఘటనను తెలుసుకున్న మేమున్నాం covid-19 సేవా సంఘం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.