Breaking News

రత్నంపేటలో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి: బిజెపి నాయకులు

0 18

రత్నంపేటలో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి: బిజెపి నాయకులు డిమాండ్.

విశాఖ జిల్లా,కొయ్యూరు మండలం, రత్నంపేటలో మంచినీటి సమస్య కారణంగా అక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రత్నంపేట మహిళలు, ప్రజలు సమాచారం మేరకు గత 6 నెలలుగా డ్రైనేజీ కాలువలు తీయడంతో అక్కడ మంచినీటి కొళాయిలు తీసేయడం జరిగింది. ఈ కారణంగా రత్నంపేటలో మహిళలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

డ్రైనేజీ వ్యవస్థ కూడా అసంపూర్ణంగా ఉందని ప్రజలు తెలిపారు. 

ఈ సమస్య గురించి గత నెల రోజులు ముందు గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు, కొయ్యూరు మండల బిజెపి అధ్యక్షులు మురుకుర్తి అప్పలరాజు, బిజెపి గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రీమల చందరరావు, అరకు జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి అరిమెల రాజు, బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అర్జున్ రెడ్డి, బిజెపి మండల నాయకులు కొర్ర శ్రీనాథ్ సందర్శించి, సంబంధిత అధికారులకు వినతి పత్రం కూడా సమర్పించినప్పటికి ఈ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని,

ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి, వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.