Breaking News

నిన్న టిడిపి, నేడు వైఎస్ఆర్ పార్టీ, రేపు ఏపార్టీ వైపో?

0 20

 నిన్న టిడిపి, నేడు వైఎస్ఆర్ పార్టీ, రేపు ఏపార్టీ వైపో?

నిన్న టిడిపి పార్టీ కండువా వేసుకొని, నేడు వైసిపి కండువా వేసుకున్న మంప గ్రామస్తులు.(చిత్రం)

 నిన్న శనివారం విశాఖ జిల్లా, కొయ్యూరు మండలం, మంప పంచాయితీలో జరిగిన టిడిపి గౌరవ సభలో కొంతమంది వైసిపి పార్టీ కార్యకర్తలు టిడిపి పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్,మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కండువా వేసుకుని చేరారు.

అయితే ఏం జరిగిందో ఏమో గానీ నిన్న టీడీపీలో చేరిన వారంతా ఈరోజు కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్, మండల అధ్యక్షులు  జల్లి బాబులు సమక్షంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగింది.

కొయ్యూరు మండలం మంప గ్రామ పంచాయతీ నందు నిన్న జరిగిన టిడిపి గౌరవ సభలో మంప గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు టిడిపిలోకి చేరారని ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. 

కానీ ఎవరికీ అంతుచిక్కని రహస్యంలా 24 గంటలు గడవక ముందే ఈరోజు వారందరూ మళ్లీ వైసిపి పార్టీలోనే చేరారు.

ఈ సందర్భంలో ఈ ఫోటోలు, వీడియోలు చూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యి

నిన్న టీడీపీ, నేడు వైసిపి, రేపు ఏపార్టీ వైపో అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.

ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్ , కొయ్యూరు వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు జల్లి బాబులు,మంప సర్పంచ్ త్రినాథ మూర్తి పడాల్,వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ,మహిళా అధ్యక్షురాలు కొప్పు రాజులమ్మ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రేగటి ముసలినాయుడు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.