చింతపల్లి: విశాఖ జిల్లా,చింతపల్లి మండలం,పెదబరడ పంచాయితీ, కృష్ణాపురం గ్రామంలో శ్రీ శ్రీ పాకలపాటి గురుదేవుల ఆశ్రమం ఏజెన్సీలోని 11 మండలాల భక్తులు అలాగే మైదన ప్రాంత భక్తులు కూడా వచ్చి ఏకనామము చెప్పి సేవాకార్య క్రమాలు చేస్తూ వుంటారు.
ఆలయంలో శ్రీ రామానంద స్వామీజీ ఆధ్వర్యంలో సంవత్సరం పాటు శ్రీ రామ జయరామా ఏకనామము ప్రతి గ్రామంలో చెప్పడం జరిగుతుంది.
ఆలయం చిన్నదిగా వుండటంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఆలయం కొత్తగా నిర్మించడం,అలాగే సుమారు పదిహేను ,పదహారు గ్రాములు వారు వచ్చి స్లాబ్ వేయడం జరిగింది.ఇక పై నుంచి ప్రతి నెల రామాలయంలో కళ్యాణ మండపం కూడా ప్రతి పౌర్ణమికి,ఆమవాస్యకు,అన్నసంతర్పణ మరియు సేవా కార్యక్రమాలు,హోమాలు యజ్ఞాలు జరుగుతాయి అని సాగిన బద్రీనాథ్ తెలిపారు.