Breaking News

గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాల ఏర్పాట్లను పర్యవేక్షించిన కాకాణి.

0 21

 “గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాల ఏర్పాట్లను పర్యవేక్షించిన కాకాణి.


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరు నగరంలోని మేకపాటి గౌతమ్ రెడ్డి గారి నివాసంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయ ఇన్ చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, ఆర్.డి.ఓ. హుసేన్ సాహెబ్ గారు, తదితరులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

స్క్రోలింగ్ పాయింట్స్:

👉 మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పార్ధివదేహాన్ని మంగళవారం, హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో ఉదయం గం.10-00లకు నెల్లూరులోని ఆయన స్వగృహానికి తరలించడం జరుగుతుంది.

👉 మంగళవారం ఉదయం గం.10-00ల నుండి పార్థివదేహాన్ని ప్రజలు సందర్శించి, నివాళులర్పించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.

👉 బుధవారం ఉదయాన్నే భౌతికకాయాన్ని ఉదయగిరికి తరలించి, మ౹౹గం.11-00ల ప్రాంతంలో అధికార లాంఛనాలతో ఉదయగిరిలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.

👉 ఉదయగిరిలో జరిగే మేకపాటి గౌతమ్ రెడ్డి గారి అంత్యక్రియల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారు.

Leave A Reply

Your email address will not be published.