జనప్రళయంతో దిగ్విజయంగా అరుకులో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం అవగాహన సదస్సు.
కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర కమిటీల అగ్ర నేతలతో దద్దరిల్లిన వేదిక.
కాంగ్రెస్ పార్టీ తోనే గిరిజనుల హక్కులు చట్టాలు సంస్కృతి సాంప్రదాయం (జల్ జమీన్ జంగల్ ) కాపాడబడతాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి పాచిపెంట శాంతకుమారి.
అరకు నియోజకవర్గం: విశాఖ జిల్లా,అరకు వేలి మండలం తేది:- 21-02-2022 భారతదేశం వ్యాప్తంగా అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ,పార్లమెంట్ సభ్యులు రాహూల్ గాంధీ ఆదేశాల మేరకు అరకు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ అధ్యక్షతన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ శ్రీమతి పాచిపెంట శాంత కుమారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం అవగాహన సదస్సు విశేష ఆదరణతో దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా
మాజీ పార్లమెంట్ సభ్యురాలు R.G.P.R.S నేషనల్ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఆర్గనైజేషన్ PRO శ్రీమతి మీనాక్షి నటరాజన్, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్మ మరియు AICC మెంబర్స్ మాజీ కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు, APCC వర్కింగ్ ప్రెసిడెంట్ లు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మహిళా నాయకురాలులు, పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అన్ని అసెంబ్లీల మండలాల అధ్యక్షులు కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నాయకురాలులు ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.