Breaking News

ఆ గ్రామస్తులకు ఊట నీరే ఆధారం.

0 21

 కొయ్యూరుఆ గ్రామస్తులకు ఊట నీరే ఆధారం.

వివరాల్లోకి వెళ్తే … 

విశాఖపట్నం జిల్లా,కొయ్యురు మండలం,బూధరాళ్ళు పంచాయితీకి చెందిన మారుమూల దొడవ గొయ్యి గ్రామములో మంచి నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది.

ఆ గ్రామం నుంచి అర కిలోమీటర్ దూరంలో ఒక ఊట నీటి గొయ్యి ఉంది.

ఆ గ్రామస్థులకు ఆ ఊట నీరే ఆధారం.

దొడవ గొయ్యి గ్రామస్తుల మంచినీటి కష్టాలు.


వర్షాకాలంలోనైతే పడిన వర్షపు నీరు కొండలమీదుగా ఆ ఊట నీటి గొయ్యి నుండే ప్రవహిస్తుందని,వేరే గత్యంతరం లేక ఆ నీటినే మంచినీరుగా ఉపయోగిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. 

ఇప్పుడు రానున్నది ఎండాకాలం కనుక ప్రతి ఎండాకాలం  ఊట నీరు ఇంకిపోయి చాలా తక్కువ వాటర్ ఉంటుందని అన్నారు.

ఈ యొక్క సమస్యను తమ బూధరాళ్ళ పంచాయతీ సర్పంచ్ కి తెలియజేశామని, దీనికి సానుకూలంగా స్పందించి ఈ సమస్యను సర్పంచ్ పరిష్కరిస్తామని చెప్పారని తెలిపారు.

కనుక ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని దొడవ గొయ్యి గ్రామస్తులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.