మండల టిడిపి బి సి సెల్ ప్రధానకార్యదర్శిగా అంకంరెడ్డి వరాహలాబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.విశాఖ జిల్లా, గొలుగొండ మండలం ఏ.ఎల్.పురం గ్రామానికి చెందిన తెలుగుదేశంపార్టీ యువ కార్యకర్త అయిన అంకంరెడ్డి వరహాల బాబు మండల బి సి సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
టిడిపి నూతన బిసి సెల్ ప్రధాన కార్యదర్శి వరహాలబాబు. |
మంగళవారం మండల టిడిపి అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరిగాయి. అంకంరెడ్డి వరహాలబాబు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వలన తనను గుర్తించి మాజీ జడ్పీటిసి చిటికెల తారక వేణుగోపాల్ ఈ అవకాశం ఇచ్చారని అన్నారు. తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మండలంలో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని అన్నారు.