విశాఖ కంచరపాలెంలో హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది… వినోద్ అనే 30 ఏళ్ల యువకుడు బుధవారం తెల్లవారుజామున అందరు పడుకున్న సమయం కావడంతో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనితో ఒక్కసారిగా కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఐదవ పట్టణ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి మృతి చెందిన బాడీని పోస్టుమార్టం నిమ్మితం విశాఖ కె.జి.హెచ్ కు తరలించారు..ఘటనపై కుటుంబీకులు ఆర్థిక సమస్యల నేపధ్యంలో ఆత్మహత్య కు పాల్పడినట్లు తెలిపారని ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చర్యలు చేపట్టామని ఐదవ పట్టణ సిఐ కృష్ణారావు తెలిపారు.