గేదెల పాడు తారు రోడ్డు పనులకు శంఖుస్థాపన
చేసిన వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు.
విశాఖ జిల్లా,హుకుంపేట మండలం:
హుకుంపేట మండలంలోని జర్రాకొండ పంచాయితీ గేదెల పాడు తారు రోడ్డు నిర్మాణ పనులకు హుకుంపేట మండల వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండల రావు శంఖుస్థాపన చేశారు.
తారు రోడ్డు పనులకు శంఖుస్థాపన చేసిన అనంతరం వైస్ ఎంపీపీ కొండలరావు మాట్లాడుతూ గేదెల పాడుకు తారు రోడ్డు మంజూరుతోదశాబ్దాలుగా ప్రజలు పడుతున్న కష్టాలు కొంత మేర తీరనుండడం ఆనందంగా ఉందని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జర్రాకొండ సర్పంచ్ కే చిట్టిబాబు, మాజీ సర్పంచ్ ఎస్ ఎర్రం నాయుడు,మెరకచింత మాజీ సర్పంచ్, సీపీఎం పార్టీ హుకుంపేట మండల కార్యదర్శి వలస నైని లక్ష్మణ్ రావు,వార్డ్ మెంబర్ లు మర్రి శైలజ,మర్రి కేశవ రావు,పంచాయితీ ప్రజలు సూకూరు కర్రి దొర,ఎస్ భాస్కరరావు,పాంగి మల్లేశ్వర రావు,కొర్ర అప్పారావు,మల్లమ్మ,దేవి,గేదెల పాడు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.