బూదరాళ్ళ పంచాయతీ బాలరేవులలో వైసిపి, టిడిపి నుంచి బిజెపి లో చేరిక:
బిజెపి కొయ్యూరు మండల కార్యవర్గ సమావేశం సందర్భంగా కొయ్యూరు మండల అధ్యక్షులు మురుకుర్తి అప్పలరాజు ఆధ్వర్యంలో భారీగా వైసిపి, టిడిపి నుంచి బిజెపిలో చేరడం జరిగింది.
ఈ మండల కార్యవర్గ సమావేశంలో బూదరాళ్ళ పంచాయతీ 39 గ్రామాల ప్రజలు పలు సమస్యల గురించి చర్చించడం జరిగింది.
వైసిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులను స్టిక్కర్లు వేసి, ప్రచారం చేస్తుందని రాష్ట్ర బిజెపి నాయకులు ప్రజలకు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు, బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు, బిజెపి సీనియర్ నాయకులు పెనమాక రవికుమార్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాఘవేంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈక బుల్లికొండలుదొర, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా రామకృష్ణ , జిల్లా ప్రధాన కార్యదర్శి అరిమెల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు సోళ్ల బుచ్చిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శరభ వేమనబాబు, బిజెపి గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రీమల చందరరావు, బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అర్జున్, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మచ్చల మంగతల్లి, మండల మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ, మండల కార్యవర్గ సభ్యురాలు లోకుల అచ్యుతవాణి, మండల ప్రధాన కార్యదర్శి కొర్ర త్రీనాథ్, మండల ఒబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి గాలి దేవుడు భారీగా బూదరాళ్ళ గ్రామ పంచాయతీ ప్రజలు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.