పవన్ అభిమానులను అడ్డుకున్న పోలీసులు. |
రాష్ట్ర మంత్రులు కొడాలి నాని ,పేర్ని నానిలకు కృష్ణాజిల్లా గుడివాడలో పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ తగిలింది. పట్టణంలోని జి 3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని,కొడాలి నానిలను అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.జై పవన్ కళ్యాణ్,ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటు అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. థియేటర్లో భీమానాయక్ ప్రారంభ చిత్రం కావడంతో పెద్దసంఖ్యలో అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.జి 3 థియేటర్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న గుడివాడ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్తో పాటుగా పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను కక్ష పూరితంగా అడ్డుకోవడం దారుణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.సినీ ఫోటో గ్రాఫి శాఖ మంత్రికి వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వచ్చిన తమను అరెస్ట్ చెయ్యడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడ్డారు.