Breaking News

ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ పిల్లలను సురక్షితంగా తిరిగి రప్పించాలని విజయసాయిరెడ్డిని కలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు.

0 21

 ఉక్రెయిన్ లో చిక్కుకున్న విశాఖకు చెందిన విద్యార్థులను సురక్షితంగా తిరిగి రప్పించాలని సర్క్యూట్ హౌస్ లో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని కలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు.


విద్యార్థులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ వ్రాయడంతో పాటు ఫోన్ చేసి విద్యార్థులను సురక్షితంగా రప్పించాలని కోరడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఈ విషయంపై స్పష్ఠమైన హామీ కూడా లభించిందని అన్నారు.తల్లి దండ్రులు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఎంపీని కలిసిన వారిలో సబ్బవరంకి చెందిన తరుణ్ తండ్రి శ్రీనివాస్, పెందుర్తికి చెందిన యోగేష్ తల్లి ఆశాజ్యోతి,రాంపురంకి చెందిన శ్రీజ తండ్రి అర్జున్ రెడ్డి ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.