Breaking News

ప్రమాదాలను తలపిస్తున్న కిన్నేరలోవ రహదారి..

0 21

 ప్రమాదాలను తలపిస్తున్న కిన్నేరలోవ రహదారి. ఆదివాసీల గ్రామాభివృద్ధి పై ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే ఓ నిదర్శనం.


తీగలవలస నుండి  కిన్నెరలోవ వరకు 8 కిలోమీటర్లు  తారు రోడ్డు సౌకర్యం కల్పించండి మహాప్రబో..

జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తక్షణమే స్పందించాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సీదేరి లింగన్న డిమాండ్.

విశాఖ ఏజెన్సీ,అరకు నియోజకవర్గం:

హుకుంపేట మండలం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరకు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్  పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పరిధిలో గల కిన్నెరలోవ ఆదివాసి గ్రామాన్ని పర్యటించిన హుకుంపేట యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సీదేరి లింగన్న. తీగలవలస గ్రామం నుండి కిన్నెర లోవ గ్రామానికి 8 కిలోమీటర్లు తారు రోడ్డు సౌకర్యం తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు. 

శుక్రవారం వారం నాడు  కిన్నెరలోవ గ్రామాన్ని పర్యటించిన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాలు కావస్తున్నా నేటి ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఆదివాసీ మారుమూల గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం చాలా దుర్మార్గమని, గ్రామపంచాయతీ కేంద్రమైన తీగల వలస నుండి కిన్నెర లోవ గ్రామానికి సుమారు ఎనిమిది కిలోమీటర్లు కనీసం నేటికీ తారు రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం దౌర్భాగ్యమని, సుమారు 8 కిలోమీటర్లు మేర రోడ్డు చాలా అస్తవ్యస్తంగా అధ్వానంగా మారిందని పెద్ద పెద్ద గుంతలతో ప్రయాణికులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని, ఆస్పత్రికి గర్భిణీ స్త్రీలు వృద్ధులు మహిళలు వెళ్లడానికి 108 బండి మరియు రేషన్ పంపిణీ నిమిత్తం డోర్ డెలివరీ బండి వెళ్ళడానికి అవకాశం లేనంతగా తీవ్ర అవస్థలు పడుతున్నారని ఈ మార్గం గుండా పోవు చాలా గ్రామాలకు చెందిన మారుమూల గిరిజన ప్రజలు విద్యార్థులు, చాలా ఇబ్బందులు పడుతూ ఆవేదన చెందుతున్నారని, చాలా సార్లు స్థానిక ఎమ్మెల్యేకి ఉన్నత అధికారులకు వినతి పత్రాలు అందించినప్పటికి పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం స్పందించి తీగల వలస నుండి కిన్నెర లోవ వరకు ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుండి తారు రోడ్లు నిర్మాణం పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో  పెద్ద ఎత్తున గ్రామస్తులు గ్రామ పెద్దలు మహిళలు సీదేరీ సూరిబాబు, సీదేరి నానాజీ, సీధేరి శ్రీను, కిల్లో లక్ష్మణరావు, వంతల నాగేశ్వర రావు, కిల్లో శంకర్రావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు,  తదితరులు పాల్గొనడం జరిగింది.


Leave A Reply

Your email address will not be published.