గిరిజనేతరులు గిరిజనులకు దోపిడి చేయకూడదు, గిరిజనులు గిరిజనేతరులకు దోపిడీ చేయకూడదు.
గిరిజనేతరులు గిరిజనులకు దోపిడీ చేసిన,గిరిజనులు గిరిజనేతరులకు దోపిడీ చేసిన దోపిడీ దోపిడేనని దీన్ని మన్య ప్రాంతవాసులు గమనించాలని దండకారణ్య విమోచన మరియు ఉద్యోగ సమితి పునరుద్ఘాటించింది. మన్యంలో బ్రతుకుతెరువుకోసం వలస వచ్చిన గిరిజనేతరులలో కొంతమంది అమాయక ఆదివాసి బిడ్డలను రకరకాల ప్రలోభాలతో లొంగదీసుకొని ఆదివాసీల భూములను,ఇండ్ల స్థలాలను నిర్మించబడిన ఇండ్లను సహితం ఆక్రమించుకుని దోపిడీకి పాల్పడటమే కాకుండా ఆదివాసీ మహిళలను రెండవ భార్య పేరుతో ఉంప్పుడు గత్తెలుగా ఉంచుకొని రాజ్యాధికారం చేజిక్కించుకొని ఆదివాసీల హక్కులను, చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని దండకారణ్య విమోచన సమితి మరియు దండకారణ్య ఉద్యోగ సమితి రాష్ట్ర కమిటీలు సంయుక్తంగా విమర్శించారు. మన్యంలో వేలాది మంది ఆదివాసేతరులు వ్యాపారం చేసుకుంటుంటే వారిలో బహు కొద్ది మంది నానా రకాలుగా దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. అంతటితో ఆగకుండా గిరిజనులు గిరిజనేతరుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఈ మర్మాన్ని యావత్ గిరిజనేతరులు గ్రహించాలని హితవు పలికారు. ఇదిలా ఉండగా మేమేం తక్కువ తిన్నామని వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న ఆదివాసి రాజకీయ నాయకులు ఆదివాసి చట్టాలను తుంగలో తొక్కి అమాయక ఆదివాసీల భూములను ఆదివాసే తరులకు అమ్మ జూపి డబ్బు దండుకోవడం బినామీలుగా వ్యవహరించడమే కాకుండా గిరిజనేతరులలో ఉన్న అమాయక వ్యాపారస్తులను కూడా బెదిరించి డబ్బులు దండుకుని అటు గిరిజనులను ఇటు గిరిజనేతరులను దోచుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా శనివారం చింతపల్లిలో పర్యటించి గిరిజనేతరుల చేత దురాక్రమణకు గురైన ఆదివాసీల గృహ స్థలాలను పరిశీలించడం అయినది. ఈ అక్రమ కట్టడాల వెనుక మంత్రులు,మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు ఇంకా చోటా మోటా నాయకులు అలజడి ఉన్నట్టు ప్రాథమికంగా గ్రహించడం జరిగిందని, అంతేకాకుండా ఇంకా ఉన్న అధికారులు ఈ నేతల వలన తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని చట్టం, జీవోలు అమలు చేయాలంటే ఉద్యోగులు భయపడుతున్నారని డి ఎల్ వో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒకరి భూములు మరొకరు అమ్ముకోవడం వంటివి మా పరిశీలనలో ప్రాథమికంగా తేలిందని తెలిపారు. ఇదే అదనుగా కొంతమంది చిల్లర అధికారులు అమాయక ఆదివాసీలతో అలాగే ఆదివాసే తరులతో ఆడుకుంటున్నారని ఆక్షేపించారు. చింతపల్లిలో జరిగిన పరిణామాలపై విచారణ జరుపుతున్నామని, పూర్తిస్థాయి విచారణ అనంతరం దోపిడీదారులు ఎవరో ప్రజా క్షేత్రంలో నిలబెడతామని డీఎల్ వో మరియు డి ఈ ఓ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి పర్యటనలో అడ్వైజర్ వి వి బాలకృష్ణ మరియు డి ఎల్ వో మరియు డి ఈ ఓ, దండకారణ్య విమోచన సమితి రాష్ట్ర అధ్యక్షులు పి.రంజిత్ కుమార్, ఉద్యోగ సమితి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎస్ మాణిక్యం, ముఖ్య కార్యదర్శి ఎల్ బి. కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.