ప్రజలను ఆకర్షిస్తున్న మిలన్ రిహార్సల్స్.
విశాఖ అర్బన్,బీచ్ రోడ్డు: విశాఖ నగరంలో జరుగుతున్న ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో జరుగుతున్న మిలన్ సందర్భముగా నిర్వహిస్తున్న సన్నాహక విన్యాసాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి అని బీచ్ కు వచ్చే సందర్శకులు చెబుతున్నారు.ఫిభ్రవరి 24 నుంచి సన్నహక విన్యాసాలు జరుగుతున్నాయి అని ఫైనల్ సన్నహక విన్యాసాలు ఫిబ్రవరి 26న జరుగుతాయి అని ప్రధాన విన్యాసాలు ఫిబ్రవరి 27న జరుగుతాయి అని నౌకాదళ అధికారులు చెబుతున్నారు. మధ్యహ్నము 3-30నుంచి రాత్రి 7-30 వరకు జరుగుతాయి అని చెప్పారు.ఇందులో భాగముగా నౌక విన్యాసాలు,విమాన హెలికాప్టర్ విన్యాసాలు జరుగుతాయి అని అలాగే సాయత్రం 6-30కు ఇతర దేశాల నుంచి వచ్చిన నౌకాదళ సిబ్బంది మరియు స్తానిక కళాకారులతో పెరేడ్ జరుగుతుంది అని ఇందులో యన్ సి సి,కోస్ట్ గార్డ్,స్పెషల్ ఫోర్స్,ఇండియన్ నేవీ వెటరన్స్,ఇండియన్ నేవీ బ్యాండ్ ట్రూప్,యెన్ యస్ జి గార్డ్స్,ఇండియన్ నేవీ మార్చ్ ఫాస్ట్ గ్రూప్,ఏపి పోలీస్ బ్యాండ్ ట్రూప్,ఏపి పోలీస్ మార్చ్ ఫాస్ట్ గ్రూప్,కోరుకొండ సైనిక్ స్కూల్ మార్చ్ ఫాస్ట్ ప్లాటూన్,బ్యాండ్ ప్లాటూన్, వాటి వెనుక మలేసియా నౌకాదళ ప్లాటూన్,మయన్మార్ నౌక దళ ప్లాటూన్, సి శెల్స్ నౌకాదళ ప్లాటూన్,అమెరికా నౌకాదళ ప్లాటూన్,ఇంకా ఇతరదేశాల నౌక దళాల ప్లాటూన్ సిబ్బంది,మరియు వీరితో పాటు స్థానిక గరగ నృత్య,కళాకారులు,థింసా నృత్య కళాకారులు,కూచిపూడి కళాకారులు,తప్పెడ గుళ్ళు కళాకారులు తదితర కళాకారులు కూడా తమ యొక్క కళారూపాలను ప్రదర్శిస్తూ పెరేడ్ లో పాల్గొంటారని వారి వెనుక విశాఖ స్మార్ట్ సిటీ శకటం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాలు సంక్షేమ పథకాల శకటం,పచ్ హత్తర్ సాల్ అజాది క అమృత్ మహోత్సవ శకటం పెరేడ్ లో పాల్గొంటాయి అని నౌక దళ అధికారులు చెబుతున్నారు.మిలన్ విన్యాసాల సందర్భముగా పోలీస్ లు బీచ్ రోడ్డులో మరియు విశాఖ నగరంలోని ఇతర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.మిలన్ సందర్భముగా సముద్రంలో వున్న భారత నౌకా దళానికి చెందిన నౌకలను విద్యుద్దీపాలతో అలంకరించారు.మిలన్ సందర్భముగా నిర్వహిస్తున్న విన్యాసాలు తమను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అని బీచ్ కు వచ్చే సందర్శకులు చెబుతున్నారు.