గొలుగొండ: ఈనెల 27న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామని కృష్ణాదేవిపేట వైద్యాధికారి వాసిరెడ్డి ప్రణతి మీడియా వారికి తెలిపారు.ఆమె మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు.
ఏడాది వయసు ఉన్న చిన్నారుల నుండి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల వరకు నులిపురుగుల మందులు పంపిణీ చేస్తామని తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో, ఇంటింటికీ వైద్య సిబ్బంది వచ్చి నులిపురుగుల మందులు ఇస్తారని,వాటిని సద్వినియోగ పరుచుకోవాలని వైద్యాధికారి ప్రణతి కోరారు.