వి.మాడుగుల మండలం మాడుగుల పంచాయతీలో గదబురు గ్రామంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో వి.మాడుగుల మండలంలో అన్ని గిరిజన గ్రామాలను ఐదవ షెడ్యూల్డ్ లోచేర్చాలని నాన్ షెడ్యూల్ ఏరియా గిరిజన గ్రామాలను పాడేరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలు విస్తృతంగా పంపిణీ చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాన్ షెడ్యూల్ ఏరియా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరట నరసింహమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో పునర్ విభజన లో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, కొత్త జిల్లాలులో పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాన్ షెడ్యూల్ ఏరియా గిరిజన గ్రామాలను చేర్చాలని అలాగే ఈ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని నాన్ షెడ్యూల్ గ్రామాల గిరిజనులంతా ముక్తకంఠంతో కోరుతున్నారని తెలిపారు. గిరిజనులకు షెడ్యూల్ ఏరియా నాన్ షెడ్యూల్ ఏరియా అని రెండు భాగాలుగా విభజించి పరిపాలన చేయడం సరియైనది కాదని ఆయన అన్నారు. గిరిజనులకు సంక్షేమ స్కీములు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు భూబదలాయింపులాంటి చట్టాలు రిజర్వేషన్ కు దూరం చేస్తూన్నారని మండ్డిపడ్డారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులుు, అధికారులు గిరిజన గ్రామాల పై శ్రద్ధ వహించి ఈ గ్రామాలను పాడేరు జిల్లాలో కలపి 5వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి కనకయ్యయ, జి.అప్పపన్న, గత్తుం అంగూరు, కడుతుల దేముుడు, పిల్లి ఎర్రమ్మ, ఓండ్రు కొండమ్మ, పైడితల్లిమ్మ గిరిజనులు పాల్గొన్నారు.
Related Posts