Breaking News

కొమ్మిక గ్రామానికి చెందిన “వెంకట్ “కి షార్ట్ ఫిలిమ్ లో అవార్డు.

0 20

 రీల్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ” పి ఆర్ ఎన్ ” షార్ట్ ఫిల్మ్ కి రెండు అవార్డులు లభించాయి.

మహారాష్ట్ర, ఔరంగాబాద్ లోని మౌలానా ఆజాద్ రీసెర్చ్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరిగింది.. 

ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మహారాష్ట్ర వారి ప్రాంతీయ సాంప్రదాయ తలపాగా చుట్టి ఆహ్వానించారు. కార్యక్రమం లో ప్రతీ ఒక్కరూ ఇదే తలపాగా ధరించటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కోవిడ్ 19 ఫిల్మ్ కేటగిరీలో ” పి ఆర్ ఎన్ ” షార్ట్ ఫిల్మ్, ఉత్తమ నటుడు, ప్రత్యేక గుర్తింపు అవార్డులకు నామినేషన్ లో ఉంది. 

కాగా, ఆ రెండు అవార్డులు “పి ఆర్ ఎన్” కే లభించాయి. ఉత్తమ నటుడు గా విశాఖపట్నం జిల్లా, కొయ్యూరు మండలం, కొమ్మిక గ్రామానికి చెందిన క్రాంతి కుమార్ అవార్డు అందుకున్నారు. అలాగే, ప్రత్యేక గుర్తింపు అవార్డు దర్శకుడు యన్ వెంకట్ రాఘవ కి దక్కింది. 

షార్ట్ ఫిల్మ్ నటుడు క్రాంతి మాట్లాడుతూ, ఈ అవార్డు పొందటం చాలా ఆనందంగా ఉంది అని, షార్ట్ ఫిల్మ్ పై ఉన్న చులకన భావం ఇకనైనా తొలగిపోవాలని ఆశిస్తున్నాను అని, షార్ట్ ఫిల్మ్స్ చేసే వారిని ప్రోత్సహించాలని, షార్ట్ ఫిల్మ్ పరంగా అందుకున్న నా మొదటి అవార్డును నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నానని, ఇంత గొప్ప అవకాశం కల్పించిన మా దర్శకుడు యన్ వెంకట్ రాఘవ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.

దర్శకుడు యన్ వెంకట్ రాఘవ మాట్లాడుతూ, నా షార్ట్ ఫిల్మ్ కి స్పెషల్ జ్యూరీ అవార్డు లభించడం చాలా ఆనందంగా ఉందని, సక్రమమైన ఎక్విప్మెంట్, ఎటువంటి ఆర్థిక సహకారాలు లేకుండా ఈ ఫిల్మ్ తీసామని, ఇన్ని అవార్డులు ఈ ఫిల్మ్ కి లభించటం ఎంతో ఆనందాన్ని కలిగించింది అని, దాని వెనుక ఉన్న కష్టం కూడా అలాంటిదే అని అన్నారు. లఘు చిత్ర నిర్మాణానికి అవసరమైన పరికరాలు, ఆర్థిక సహకారం ఉంటే, ప్రేక్షకులను మరింత వినోదం అందిచగలనని, మరొన్నో విజయాలు కూడా సాధించవచ్చని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.