Breaking News

రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న: రింతాడ ఉప సర్పంచ్.

0 19

* రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న రింతాడ ఉప సర్పంచ్.


విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం,సంకాడ పంచాయతీ సంకాడ గ్రామానికి చెందిన పూజారి చిరంజీవి గారి అబ్బాయి పూజారి రాజవెంకట కిరణ్ తేజ అనే యువకుడు (వయసు 22) ప్రమాదవశాత్తు నర్సీపట్నంలోని అక్షయ హాస్పిటల్ చేర్పించిన తర్వాత స్కానింగ్ చేయగా తొడ ఎముక విరిగి పోవడంతో ఆపరేషన్ చేయాలని,అందుకు అత్యవసరంగా A పాజిటివ్ రక్తం ఒక యూనిట్ ఎక్కించాలని డాక్టర్ తెలుపగా,రక్తం కోసం పేషెంట్ వాళ్ళ బంధువులు ద్వారా విషయం తెలుసుకున్న రింతాడ ఉప సర్పంచ్ మడపల సోమేష్ కుమార్ వెంటనే స్పందించి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయనికి వెళ్లి తిరిగి ప్రయాణంలో అనకాపల్లిలోని శ్రీ సూర్య అభయాంజనేయ బ్లడ్ బ్యాంక్ సెంటర్ లో వెళ్లి శుక్రవారం రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. దాత రక్తమును వెంటనే పేషెంట్ కు ఆపరేషన్ అనంతరం ఎక్కించారు. పేషెంట్ బంధువులు రక్తదానం చేసిన దాతని అభినందించి ధన్యవాదములు తెలిపారు. అనంతరం రక్తదాత మడపల సోమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడాలని,రక్తం దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.
Leave A Reply

Your email address will not be published.