నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను ఐదవ షెడ్యూల్డ్ లో చేర్చాలని వచ్చే నెల 3న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం.
ఏజెన్సీని ఆనుకోని ఉన్న గిరిజన గ్రామాలను పాడేరు జిల్లాలో కలపాలి.
నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను ఐదవ షెడ్యూల్డ్ లో చేర్చాలి.
విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీని ఆనుకోని ఉన్న నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను ఐదవ షెడ్యూల్డ్ లో చేర్చాలని కొత్తగా ఏర్పడుతున్న పాడేరు (అల్లూరి సీతారామరాజు) జిల్లాలోని గిరిజన గ్రామాలను కలపాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల మూడున గురువారం విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యాక్రమం చేపడుతున్నట్లు గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్డ్ సాధన కమిటీ జిల్లా కార్యదర్శి ఇరట నరసింహమూర్తి వ్వవసాయకార్మిసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న పేర్కొన్నారు.
ఆదివారం దేవరాపల్లి లో విస్త్రుతంగా కరపత్రాలుతో ప్రచారం నిర్వహించి నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాల గిరిజనులు కదలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు.
అనంతరం వారు మాట్లాడుతూ 1956 మరియు 1976 లోను కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్డ్ ఏరియా గజిటెడ్ నోటిఫికేషన్లు నేటికి నాన్ షెడ్యూల్డ్ ఏరియా గిరిజనులకు అన్యాయం చేసారని అశాస్ర్తీయ సర్వేతో ఐదవ షెడ్యూల్డ్ ఏరియాను పాలకులు ప్రకటించారని.
పాలకుల చారిత్రక తప్పిదంవల్ల నాన్ షెడ్యూల్డ్ గిరిజనులు భూమి,ఉద్యోగం,ఉపాధి అవకాశాలు 1/70 భూ బదలాయింపు చట్టం కోల్పోయారని అన్నారు .
నాన్ షెడ్యూల్డ్ గ్రామాలను 5 వ షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని గిరిజన సంఘం నిర్వహించిన ఉద్యమంతో కదిలిన కేంద్ర ప్రభుత్వం ఐదవ షెడ్యూల్డ్ ఏరియాలో చేర్పించే జాబితాను పంపాలని గత 30 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం కోరిందని.
రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నేటికి నాన్ షెడ్యూల్డ్ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చలేదన్నారు.
2020 లో ఉద్యమం ఉదృతం చేయడంతో నేటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న గిరిజన సలహా మండలి తీర్మానం చేసి రాష్ట్రంలో ఉన్న నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను గుర్తించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్లును కోరిందని
విశాఖపట్నం జిల్లాలోని దేవరాపల్లి, చీడికాడ,వి,మాడుగుల,రావికమతం, రోలుగుంట,గొలుగొండ,నాతవరం, కోటవురట్ల మండలాల్లో 113 రెవిన్యూ గ్రామాల్లో 320 గిరిజన గ్రామాలును గుర్తించి నివేదిక తయారు చేశారని
వి.మాడుగుల, చోడవరం నర్సీపట్నం,పాడేరు,అరకు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో అభిప్రాయ సేకరణ కొరకు జిల్లా పాడేరు ప్రాజెక్టు అధికారి మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇప్పటికే నాన్ షెడ్యూల్డ్ ఏరియా గిరిజన గ్రామాలు అన్ని రకాల అభివృద్ధి చెందిందని కొత్తగా అభివృద్ధి చేయవలసింది ఏమిలేదని భూస్వాములు,ధనవంతులకు నష్టం కలుగుతుందని జిల్లా కలెక్టర్,ఐ.టి.డి.ఏ పాడేరు ప్రాజెక్టు అధికారిపై వత్తిడి తెచ్చిన ఎమ్మెల్యేలు నివేదిక పంపించకుండ తోక్కిపెట్టేసారన్నారు.
దీనివలన గిరిజన సలహా మండలి తీర్మానం బుట్టదాఖలు అయ్యిందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు పునర్విభజన చేస్తూ నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను అనకాపల్లి జిల్లా లోని కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని
ఇప్పటికే స్వతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు అనేక విధాలుగా ఏజెన్సీని ఆనుకోని ఉన్న నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాల గిరిజనులకు తీవ్రమైన నష్టం జరిగిందన్నారు.
ఇప్పుడు మరలా అనకాపల్లి జిల్లాలో ఏజెన్సీని ఆనుకోని ఉన్న గిరిజన గ్రామాలు చేర్చడం చారిత్రాత్మిక తప్పిదం అవుతుందని
అందుకని నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను పాడేరు అల్లూరి సితారామారాజు జిల్లాలోని కలపాలని, ఐదవ షెడ్యూల్డ్ లో చేర్చాలని గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్డ్ సాధన కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 3వ తేదీన విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరుగు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.