Breaking News

కనీసం నోటిషులు ఇవ్వరా అని అధికారులుకు సిపిఎం సూటిప్రశ్న.

0 20

 

కనీసం నోటిషులు ఇవ్వరా అని అధికారులుకు సిపిఎం సూటిప్రశ్న.

రాజకీయ పలుకుబడి ఉంటే ఏదైనా చేయోచ్చా?

 విశాఖ జిల్లా:  గుడి పేరుతో లేఆవుట్ కు ఇరవై ఐదు అడుగులు కొండతవ్వకాలు చేపట్టి రోడ్డువేసిన ఆక్రమణదార్లుకు కనీసం రెవెన్యూ అధికారులు నోటిసులు అయినా ఇవ్వరా అంటు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.వెంకన్న సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.

 దేవరాపల్లి మండలం తారువా రెవెన్యూ లోని ప్రభుత్వ విప్ సొంత గ్రామంలో డబ్బై ఐదు ఎకరాలు పంటభూముల్లో ప్రైవేటు లే అవుట్ వేస్తూ ప్రభుత్వ భూములు పోరంబోకు గోర్జులు సైతం ఆక్రమణ చేసి లేఆవుట్ కు ఆనుకొని ఉన్న తారువా పురాతనమైన వెంకటేశ్వరస్వామి గుడికి రోడ్డు అంటు ప్రచారం చేస్తు కిలోమీటరు దూరం ఇరవై ఐదు ఆడుగుల మేర కొండను తవ్వి రోడ్డు వేస్తున్న దురాక్రమణ దార్లపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఫిర్యాదు పత్రికల్లో,వార్తల్లో వచ్చిన అనంతరం రెవెన్యూ అధికారులు స్పందించి రోడ్డును నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించి చేతులు దులుపుకున్నారని తెలిపారు. సామాన్యులు సెంటు ప్రభుత్వ భూమిలో పాక వేసుకుంటే నోటీసులు ఇచ్చి తొలగించిన అధికారులు కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఎదేచ్చగా ఆక్రమించుకొని అన్యాక్రాంతం చేసి గుడి పేరుతో లే అవుట్ కు కొండను బ్లాస్టింగ్ చేసి పేల్చేసిన,చర్యలు తీసుకోకపోవడం రెవెన్యూ అధికారులుపై,రాజకీయ నాయకులు వత్తిడి ఏస్తాయిలో ఉందో అర్దమౌతుందని అన్నారు.

  వందలాది ఎకారాలు పంట భూములు పేద రైతులు నుండి కారుచౌకగా కొనుగోలు చేసి పంట పొలాల్లో అక్రమంగా లేఆవుట్ వేసి దూర పాంతాలు వారికి కోట్లాది రూపాయలుకు ఆన్లైన్ ద్వారా అమ్మకాలు చేపడుతున్నారని తెలిపారు.

 జిరాయితీ భూములు ప్రక్కనే ఉన్న ప్రభుత్వ భూములు గెడ్డవాగును సైతం కప్పేసి సదను చేస్తున్నారని తెలిపారు.

 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భూఆక్రమణ దార్లకు అండగా నిలుస్తుంది అనడానికి ఇదే నిదర్శనమన్నారు.అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు బయపడి చూసిచూడనట్లు వ్యవహరిస్తు ప్రభుత్వ భూములను జారవిడుస్తున్నారని అన్నారు.

ప్రైవేటు లేఅవుట్ కొరకు తారువా రెవెన్యూలో భూములు కొనుగోలు చేసుకోని దానికి రోడ్డు వెసుకోవాలంటే సొంత భూములు పోతాయని ఎప్పటినుండో మూలన పడిన పురాతనమైన వెంకటేశ్వరస్వామి గుడిని వెలుగులోకి తీసుకు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పగించి అభివృద్ధి చేయిస్తామని చెప్పి కొండను తవ్వేయడం ఎంతవరకు న్యామన్నారు.

ముప్పై ఆరు అడుగులు బారి రోడ్డుకోసం ఇరవై ఆరు ఆడుగులు కొండను పేల్చేసారని తెలిపారు. నిజానికి స్థానిక ప్రజాప్రతినిధులు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యపారులు ప్రయోజనం కొరకు ఈ రోడ్డు వేస్తున్నారని తెలిపారు.

     ఈరోడ్డు ఎవరి ప్రయోజనం కోసం వేస్తున్నారో కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఇంత జరుగుతున్న ప్రజలను మభ్య పెట్టి మోషం చేసి వెంకటేశ్వరస్వామి గుడికే రోడ్డు వేస్తున్నారని రెవెన్యూ అధికారులు చెప్పడంలో అర్థం లేదన్నారు.

 డబ్బై ఐదు ఎకరాలు కనుగోలు చేసి ఇందులో ప్రభుత్వ భూములను దేవదాయ భూములు గెడ్డవాగును ప్రభుత్వం బంజర్లును గోర్జను కబ్జా చేసారని వీటిని ఉన్నతాధికారుల చేత దర్యాప్తు జరిపించకుండా మీనమేషాలు లెక్కపెడుతున్నారని అన్నారు.

 ఈ లేఅవుట్ లో ప్రభుత్వ భూములు వెలికి తీయాలని కొండను తవ్వి రోడ్డు వెసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే కొండను పేల్చి రోడ్డును వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.