Breaking News

భూ సమస్యలు, అక్రమ కట్టడాల సమస్యలు, తప్పుడు ధృవీకరణ పత్రాలు రద్దు చేయండి: బిజెపి నాయకులు.

0 20

భూ సమస్యలు, అక్రమ కట్టడాల సమస్యలు, తప్పుడు ధృవీకరణ పత్రాలు రద్దు చేయండి: బిజెపి నాయకులు

సబ్ కలెక్టర్ ను కలిసిన బీజేపీ నాయకులు.

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాఘవేంద్రరావు గారు, బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మరియు జిల్లా సమాచార హక్కు చట్టం సభ్యులు అర్జున్ రెడ్డి, బిజెపి కొయ్యూరు మండల అధ్యక్షులు మురుకుర్తి అప్పలరాజు పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ గారిని కలిసి భూ సమస్యలు, అక్రమ కట్టడాల గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

స్థానిక పెండింగ్ భూ సమస్యలు, మరియు అక్రమ కట్టడాల నిర్మాణాలు, అదే విధంగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులపై విచారణ జరిపి, నిజమైన లబ్దిదారులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అభిషేక్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వినతి పత్రాలు పరిశీలించి, పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ గారు స్పందించి వెంటనే ఈ సమస్యల్ని పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని బీజేపీ నేతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.