Breaking News

బూధరాళ్ల పంచాయతీలో ఎంపీపీ రమేష్ పర్యటన.మారుమూల రోడ్ల నిర్మాణానికై అధిక ప్రాధాన్యత.

0 25

 

విశాఖ జిల్లా: కొయ్యూరు మండలంలోని అతి మారుమూల గ్రామాల సైతం రోడ్ల నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటున్నట్టు ఇప్పటికి పలు రోడ్లు మంజూరు కాగా ఇంకా కొన్ని రోడ్లు మంజూరు కావాల్సి ఉందని ఎంపీపీ బడుగు రమేష్ బాబు తెలిపారు. సోమవారం ఆయన బూధరాళ్ల పంచాయతీ కార్యదర్శి శ్రీనువాస్ తో కలిసి బూధరాళ్ళ పంచాయితీ కునుకురు, బాల రేవుల రోడ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. రోడ్ల నిర్మాణం నాణ్యత వంతంగా ఉండాలని కాంట్రాక్టర్ కు సూచించారు. అటుపై కునుకురు,వంతమర్రి,గరిమండ గ్రామాలను సందర్శించి వంతమర్రి ఎంపీటీసీ కుమారి తో కలిసి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు చెక్ డ్యాం కావాలని వంత మర్రి గ్రామస్తులు కోరారు. అలాగే విద్యుత్ సమస్య ఉందని విన్నవించగా వెంటనే విద్యుత్ పునరుద్ధరణకు పనులను చేయిస్తానని ఎంపీపీ రమేష్ బాబు హామీ ఇచ్చారు. అటుపై గరిమండ పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వంత మర్రి లో గ్రామస్తులతో మాట్లాడుతూ… మారుమూల గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రోడ్ల నిర్మాణాలు అనివార్యం అన్నారు. అందుకే మండలంలో మారుమూల రోడ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎంపీపీ వివరించారు. తాము ఇప్పటికే ఉన్నత అధికారులకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి,అరకు ఎంపీ గొడ్డేటి మాధవి లకు రోడ్ల విషయమై విన్నవించగా మండలంలోని పలు గ్రామాల రోడ్లు మంజూరు అయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్, ఎంపీటీసీ కుమారి,వైసిపి నేత బల్లా ప్రసాద్,చీడిపాలెం సర్పంచ్ సోమన్న దొర తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.