Breaking News

చింతపల్లి పరిధిలో ఉన్న బీసీ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి౼SFI

0 19

 చింతపల్లి పరిధిలో ఉన్న బీసీ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి౼SFI

  చింతపల్లి పరిధిలో ఉన్న బీసీ హాస్టల్ లో విద్యార్థులు సుమారు 70 మంది ఉంటున్నప్పటికీ సరైన సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని SFI ఆధ్వర్యంలో బీసీ హాస్టల్ లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె. ప్రభుదాస్ మాట్లాడుతూ విద్యార్థులు 70 మంది ఈ హాస్టల్ లో ఉన్నపటికీ సరైన వసతి గృహాలు, మరుగుదొడ్లు,స్నానపు గదులు, తరగతి గదులు,మంచి నీటి సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్ ఎఫ్ ఐ నేతలు తెలిపారు. నాడు నేడు నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్తున్నా ప్రభుత్వం కనీసం గిరిజన ప్రాతంలో చదువుతున్న విద్యార్థులకు మాత్రం సరియైన సదుపాయాలు లేవని, ఇప్పటికైనా నాడు నేడు కింద నిధులు మంజూరు చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని యెడల విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా కమిటీ సభ్యులు పి.జీవన్ కృష్ణ,SFI మండల కార్యదర్శి కార్తిక్ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.