Breaking News

ఆ పాఠశాల కి గేటు లేకపోవడం వల్ల జాతీయ జెండా ఎగురవేసే ఐరన్ రాడ్డు విరిచేసిన ఆకతాయిలు.

0 19

 


విశాఖ జిల్లా,కొయ్యూరు మండలం,బాలారంలోని ఎంపీపీ స్కూల్ నందు గేటు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందని పాఠశాల హెచ్ ఎం నూకరాజు తెలిపారు.

అయితే పాఠశాలకి ఎన్ ఆర్ ఈ జి ఎస్ పథకం ద్వారా కాంపౌండ్ వాల్ శాంక్షన్ అయిందని,

కాంపౌండ్ వాల్ తో పాటుగా, గేటు కూడా కట్టాల్సి ఉండగా,

కాంట్రాక్టర్ కేవలం ప్రహారి గోడ మాత్రమే కట్టి, గేటు కట్టించకుండా వదిలేసారని పాఠశాల హెచ్ ఎం తెలిపారు.

పాఠశాల కి గేటు లేకపోవడం వల్ల స్కూల్ టైంలో కూడా ఒక్కోసారి ఆవులు, మేకలు వంటి జంతువులు లోపలికి వచ్చేస్తున్నాయని, ఆవులు వల్ల పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు.

కేవలం గేటు లేకపోవడం వల్ల ఎవరో ఆకతాయిలు జాతీయ జెండా ఎగురవేసే ఐరన్ రాడ్డు కూడా విరిసి పట్టుకెళ్ళిపోయారని హెచ్ ఎం నూకరాజు తెలిపారు.

రాష్ట్రంలో రాజకీయ పార్టీల జెండాలు ఎక్కువయ్యే సరికి…. జాతీయ జెండాకి,రాజకీయ జెండాకి తేడా తెలియని పరిస్థితుల్లో కొంతమంది ఆకతాయిలు ఉన్నట్లు దీన్ని బట్టి తెలుస్తుంది.

కనుక సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలకి గేట్ వేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల హెచ్ఎం నూకరాజు కోరారు.
Leave A Reply

Your email address will not be published.