Breaking News

విశాఖ ఏజెన్సీ తాజంగిలో పండుగ వాతావరణం.

0 50

 

శుక్రవారం తెల్లవారుజాము నుంచే చింతపల్లి మండలం రాధాకృష్ణ మందిరం తాజంగి గ్రామం బీటా లైన్ వీధిలో పండగ వాతావరణం నెలకొంది. కారణం చింతపల్లి,జీకే వీధి,కొయ్యూరు మండలాల గిరిజన పూజారులకు ప్రతి నెల ఇచ్చే పూజా సామాగ్రి కార్యక్రమం ఈ చోట జరగటంతో స్థానిక భక్తులు రాధాకృష్ణ మందిరం ఆలయ కమిటీ సభ్యులు మహిళా మూర్తులు దాతలు ఎంతో ఉత్సాహంతో తెల్లవారుజామునుంచే చక్కగా అలంకరించి ఎటువంటి లోటు రాకుండా ఉండటానిక టెంట్లు, కుర్చీలు ఏర్పాట్లు చేసారు.ఉదయం ఎనిమిది గంటల కల్లా సిద్ధం చేయడం జరిగింది.మరోవైపు పూజారులకు అన్న సమారాధన ఏర్పాట్లు కూడా వేగంగా చేయడం జరిగింది.స్వామీజీ నిర్ణీత సమయానికంటే ముందుగానే తొమ్మిది గంటల కంటే ముందే చేరుకున్నారు. 9:30 గంటల నుంచి 11.30 గంటల వరకు మూడు మండలాల అర్చకులతో భజన భక్తి గీతాలు పాడించి పూజా సామాగ్రి పంపిణీ చేసిన శ్రీ శ్రీ శ్రీ సాయిరాం స్వామి. అనంతరం ఆయన మధ్యాహ్నం జి మాడుగుల మండల కేంద్రంలో తమ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న హనుమాన్ మందిరం వద్ద మిగిలిన మండలాలకు చెందిన అర్చకులకు పూజా సామాగ్రి ఇవ్వటానికి వెళ్లడం జరిగింది. 12 గంటల నుంచి రాధాకృష్ణ మందిరం ప్రాంగణంలో స్థానిక భక్తుల సహకారంతో గ్రామస్తులు చక్కని అన్నసమారాధన ఏర్పాటు చేశారు. అనంతరం చింతపల్లి మండల అర్చకుల సేవా సంఘం సభ్యులు అర్చకులు సమావేశం నిర్వహించుకున్నారు. అదే సమయంలో జికే వీధి అర్చకుల సంక్షేమ సంఘం సభ్యులు కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది.

ఏడు నెలలుగా నిర్విరామంగా ప్రతీ నెల సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ పూజాసామాగ్రి అందిస్తున్న భీమిలి స్వామీజీ కి విశాఖ మన్యం ప్రజల తరఫున మూడు మండలాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.