ఉన్నతాధికారులును ప్రజలను తప్పుదోవపట్టించోద్దు – సిపిఎం
విశాఖ జిల్లా: దేవరాపల్లి మండలం లోని తారువా లేఅవుట్ లో ప్రభుత్వ భూములు లేవంటూ రెవెన్యూ అధికారులు ప్రకటనులు చేసి ఉన్నతాధికారులను ప్రజలను తప్పుదోవ పట్టించ వద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.వెంకన్న రెవెన్యూ అధికారులను కోరారు.శనివారం ఆయన మీడియా వారితో మాట్లాడుతూ మండలంలోని మారేపల్లి,తారువ వాకపల్లి రెవెన్యూ పరిధిలో లేఅవుట్ లో వెంటనే ప్రభుత్వ భూమిని గుర్తించి వెలికి తీసి ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించి హెచ్చరిక బోర్డులు పెట్టకపోతే మేమే ప్రత్యక్ష ప్రతిఘటనకు పూను కుంటామని ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి రెవెన్యూ అధికారులు పూర్తిగా బాధ్యత వహించాలని సిపియం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి. వెంకన్న దేవరాపల్లి తహశీల్దార్ జె. రమేష్ బాబుకు రాతపూర్వకంగా ఫిర్యాదుచేశారు. ఈఫిర్యాదులో మారేపల్లి రెవిన్యూలో సర్వేనెంబర్ 111; 112/2 ; 113 ;115 ; 117 ; 188/3; 120; అలాగే తారువ రెవెన్యూ సర్వే నెంబర్ 178 ; 180 ; 182 ; 185 ; 182 ; 184 ; 185 గల భూములపై అభ్యంతరాలు ఉన్నాయని వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని సిపిఎం నాయుకులు పిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదు వచ్చిన వెంటనే తహశీల్దార్ హుటాహుటిన తన సిబ్బందితో వీఆర్వో అప్పారావు,జగదీష్,సర్వేర్ మురళితో కూడిన బృందం లేఅవుట్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తహశీల్దార్ మాట్లాడారు.ఇందులో ప్రభుత్వ భూమి ఎక్కడ అన్యాక్రాంతం కాలేదని సిపిఎం తెలియజేసిన సర్వే నెంబర్లు లో శారదా నదికి అవతల భాగాన ఉన్న సర్వే నెంబర్లు కొన్ని ఉన్నాయని తెలియజేసారని ఆసర్వేనెంబర్లో గల ప్రభుత్వభూమి పదిలంగా ఉందని అయితే వారు తెలియజేసిన దేవుని మాన్యం మారేపల్లి రెవెన్యూలో సర్వేనెంబర్ 115 లో గల భూమి జిరాయితి అని 1956 ఎస్,ఎఫ్,ఎ రికార్డు ప్రకారం జిరాయితీగా నమోదు అయ్యి ఉందన్నారు. ఇందులో శ్రీశ్రీశ్రీ సీతారాముల వారి దేవస్థానంకు మరియు అల్లు గౌరునాయుడు పేర్లు రికార్డులో నమోదై ఉన్నాయని తెలిపారు. వాస్తవానికి లేఅవుట్ దారుడు తాను కొనుగోలు చేసుకున్న భూమి కొంత మేరకు ఇదేనని ఆభూల్లోనే పనులు చేస్తున్నారని,ఇందులో గల చెరువు,గోర్జు, ప్రభుత్వ భూమిని ఎక్కడ లేఅవుట్ దారుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు లేదని ఎలా ఉన్న భూములు అలాగే ఉన్నాయని తెలియజేశారు.అలాగే సిపిఎం ఫిర్యాదు చేసినటువంటి సర్వేనెంబర్ లో గల భూములు కొన్ని ప్రభుత్వ భూములుగా ఉన్నాయని అవి పదిలంగానే ఉన్నాయని తెలియజేశారు. అయినప్పటికీ ఈ లే అవుట్ భూములు అభ్యంతరాలు తొలిగేంత వరకు ఈభూమిలో ఎటువంటి పనులు చేయరాదని ఆ పనులను నిలుపుదల చేయాలని లేఅవుట్ దారునికి తెలియజేసామని తహశీల్దార్ వెల్లడించారు.
అయితే సిపిఎం నాయకులు డి.వెంకన్న దీనిపై తీవ్రంగా స్పందించారు. మారేపల్లి రెవెన్యూ లోని 115 లో శ్రీశ్రీశ్రీ సీతారాములు దేవస్థానంకు 1914 లో మారేపల్లి గ్రామానికి చెందిన ఆవుగడ్డ కుటింబికులు దాన పట్టావ్రాయడం జరిగిందని SFA లో శ్రీశ్రీశ్రీ సీతారాములువారి దేవస్థానం పేరు మరోవ్యక్తి పేరు ఏవిధంగా నమోదు అయ్యిందో స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. రికార్డులు మార్పులు చేసారన్నది నిజమన్నారు. అదేవిధంగా లేఅవుట్ లో ప్రభుత్వ భూములు లేవని రెవెన్యూ అధికారులు,ఉన్నతాధికారులును ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు. వాకపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 78 లో కొండను తవ్వి రోడ్డు వేసింది, తారువా రెవెన్యూ లో సర్వ నెంబర్లు 178,180,182,185,182,184,గల భూములు ప్రభుత్వ భూములు కావా? అని వెంకన్న ప్రశ్నించారు.అయితే మారేపల్లి రెవెన్యూ సర్వే నెంబరు 115 దేవుని మాన్యం చివరి భాగం నుండి పనులు చేసుకొస్తున్నారని,రెవెన్యూ అధికారులు దర్యాప్తుకు వెళ్ళినప్పుడు కొద్దిపాటి జిరాయితీ భూముల్లో యంత్రాలుతో పనులు చేస్తున్న దానిని చూసి ప్రభుత్వ భూముల్లో పనులు చేయడం లేదని అవి పదిలంగా ఉన్నాయని అసలు లేఅవుట్ లో ప్రభుత్వ భూములు లేవని చేప్పడం నిర్దాణకురావడం సరైంది కాదని, ఉన్నతాధికారులను ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనులు చేయడం సరైంది కాదన్నారు. నిజాలు ప్రజలు అందరికీ తెలుసునని ప్రభుత్వ దేవదాయ భూముల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని వెంటనే చర్యలు చేపట్టాలని వెంకన్న అధికారులను కోరారు.