ఈరోజు విశాఖపట్నం జిల్లా పరిషత్ సమావేశంలో కొయ్యూరు మండల ఎంపీపీ బడుగు రమేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక,త్రాగునీరు,రోడ్లు మరియు కాకరపాడు లో మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు కొరకు అలాగే ప్రధానమైన పలు సమస్యలపై కొయ్యూరు మండలం ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడడం జరిగింది. ఇసుక సమస్య పై స్పందించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ రావు తక్షణమే ఇసుక పర్మిసన్ సచివాలయానికి ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.