Breaking News

సామాజిక సేవకు సీఆర్పీఎఫ్ ప్రాధాన్యం.

0 21

 సామాజిక సేవకు సీఆర్పీఎఫ్ ప్రాధాన్యం.

పెదవలసలో మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న సిఆర్పీఎఫ్ అధికారులు.

జికేవీధి మండలం: దేశ రక్షణతో పాటు సామాజిక సేవకు అధిక ప్రాధాన్యం ఇస్తామని సీ ఆర్పీ ఎఫ్ 234 బెటాలియన్ కమాండెంట్ సంజీవ్ కుమార్ ద్వివేది అన్నారు.మండలంలోని పెదవలస లో సిఆర్పీఎఫ్ సామాజిక సేవ కార్యక్రమం (సివిక్ యాక్షన్ ప్రోగ్రాం)లో భాగంగా ఆదివారం వృద్ధులకు దుస్తులు,రగ్గులు,విద్యార్థిని విద్యార్థులకు పుస్తక సామగ్రి,యువకులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పోలీసులంటే గిరిజనుల్లో తెలియని భయం ఉండేదని, సామాజిక అవగాహన కార్యక్రమాలు ద్వారా వారిలో చైతన్యం పెరుగుతోందని అన్నారు.గిరిజనుల సమస్యల పైన దృష్టిసారించి వారి అవసరాలు తీర్చేందుకు సి ఆర్ పి ఎఫ్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో 234 బెటాలియన్ సహాయ కమాండెంట్ కుల్ ధీప్ తుజుర్,ఇన్స్పెక్టర్ లు ఇస్తియా ఖాన్, చౌబే తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.