Breaking News

కొయ్యూరు మండలంలో ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి పుట్టినరోజు వేడుకలు.

0 20

విశాఖ జిల్లా,కొయ్యూరు మండలం.
నేడు పాడేరు ఎమ్మెల్యే కొటగుళ్లి భాగ్యలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా మండలంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ బడుగు రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి  ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అలాగే ఇదే రోజున మహిళ  దినోత్సవం కార్యక్రమం కూడా జరిపారు.
ఈ సందర్భంగా ఎంపీపీ రమేష్, జడ్పిటిసి నూకరాజు, మండల అధ్యక్షుడు జల్లి బాబులు,మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పు రాజులమ్మ మాట్లాడుతూ మహిళల గురించి, మహిళ యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని వివరించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు వైసీపీ పార్టీ నేతలు అందరి తరపున మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పు రాజులమ్మ కి శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ,సెకండ్ వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ, గాడి సత్యనారాయణ,చీడిపాలెం సర్పంచ్ శోభన్, కొయ్యూరు ఎంపీటీసీ మల్లికార్జున రావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ముసలినాయుడు, తదితర వైసిపి పార్టీ నేతలు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.