Breaking News

ఎం.మాకవరం మహిళా పోలీస్ కి ఉత్తమ అవార్డు.

0 19

 

విశాఖ జిల్లా, కొయ్యూరు మండలం లోని ఎం.మాకవరం గ్రామ సచివాలయ మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న ఎల్.కళావతి ఉత్తమ అవార్డు అందుకున్నారు.

విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఆమెకు జిల్లాస్థాయి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఆమెకు ఉత్తమ అవార్డు లభించింది.

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారుల చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు.

తనను గుర్తించి ఈ అవార్డు అందించిన అధికారులకు కళావతి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.