Breaking News

బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన…తోడు ది లోకులగాంధీ ట్రస్ట్

0 20

 బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన…తోడు ది లోకులగాంధీ ట్రస్ట్

విశాఖ జిల్లా,కొయ్యురు మండలం, కినపర్తి పంచాయతీ, ములగలమెట్ట గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన నాలుగు కుటుంబాలకు “తోడు ది లోకులగాంధీ ట్రస్ట్” బాధిత కుటుంబాలకు అవసరమైన వంట పాత్రలు,అలాగే నిత్యావసర సరుకులు,బట్టలు మొదలైనవి అందించడం జరిగింది.

ఈ సందర్భంగా లోకుల చంద్ర కిరణ్ మాస్టర్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం(ఐటీడీఏ పీఓ,జిల్లా కలెక్టర్) నుంచి ఆర్థిక సాయం వచ్చే విధంగా మా ట్రస్ట్ కృషి చేస్తుంది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ లోకుల రమేష్,జనరల్ సెక్రెటరీ మఠం మురళీ కృష్ణ ,ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు లోకుల చంద్ర కిరణ్,స్థానిక సర్పంచ్ రీమల శ్రీను,బీజేపీ నాయకులు అప్పలరాజు,రీమల చంద్రరావు,అరిమెల రాజు,శివ,నూకరాజు VHP కార్యకర్త మల్లిబాబు,పి.మాకవరం సర్పంచ్ సెగ్గే.నూకరాజు, తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.