Breaking News

పాఠశాల,అంగన్వాడీ భవనాలు మంజూరు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కి వినతి.

0 18

 ఒక మనిషి సమగ్ర మూర్తిమత్వంగా పరిణితి చెందాలి అంటే అది కేవలం చదువుతోనే సాధ్యం. కాబట్టి మనిషికి విద్య కావాలి.అందుకే పాఠశాలలు కావాలి పద్మ శ్రీనివాస్

ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కి వినతి పత్రం ఇస్తున్న పద్మ శ్రీనివాస్.

విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన కొయ్యూరు మండలం, ఎం.మాకవరం పంచాయితీ పరిధిలో గల పనసలపాడు గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ప్రాధమిక పాఠశాల,అంగన్వాడీ భవనాలు పూర్తిగా శిధిలం అయిపోయి ఉన్నాయి. ప్రాధమిక పాఠశాల, అంగన్వాడీ భవణాలు లేక ఆరు బయటనే విద్యాబోధన జరుతుంది. దానివల్ల బడి ఈడు పిల్లలైన బావి భారత పౌరులు చదువుకి దూరం అయిపోతున్నారు. కావున కొత్తగా ప్రాధమిక పాఠశాల మరియు అంగన్వాడీ భవనాల్ని వెంటనే మంజూరు చేయాలని గ్రామానికి చెందిన పద్మ శ్రీనివాసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ కుంబా రవిబాబు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.