Breaking News

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం.

0 17

 నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం, ప్రజలకు, బిజెపి నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు.
బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మరియు జిల్లా సమాచార హక్కు చట్టం సభ్యులు అర్జున్ రెడ్డి మాట్లాడుతూ… నాలుగు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ బిజెపి పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేసిన బిజెపి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

ఈ విజయం కేవలం దేశ ప్రధాని మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి నీతీ నిజాయితీ, దమ్మున్న పాలన, సమర్థవంతమైన పాలన వలన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ని ప్రజలు గెలిపించడం జరిగిందని అర్జున్ రెడ్డి అన్నారు.


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముస్లీం సోదరులు, మరీ ముఖ్యంగా ముస్లీం మాతృమూర్తులు (మహిళలు) సుమారు 30 శాతం పైగా బిజెపికి ఓటు వేయడం జరిగిందని,

కారణం సమాజ్ వాదీ పార్టీ కి ఓటు వేస్తే, ఘోరాలు, నేరాలు, దారుణాలు జరుగుతాయని, యోగీ జీ పాలనలో ప్రశాంతతా ఉందని అక్కడ ప్రజలు చెప్పడం ఆనందదాయకమని అన్నారు.

తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా బిజెపి బలపడుతుంది. కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో వెళ్ళాలన్నా మూర్ఖపు ఆలోచన పనిచేయదని,

ప్రజలకు కెసిఆర్ గురించి అంతా తెలిసిపోయిందని,ఉనికి చాటుకోవడానికి ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.

ఈ ప్రెస్ మీట్ లో కొయ్యూరు మండల అధ్యక్షులు మురుకుర్తి అప్పలరాజు, బిజెపి జిల్లా గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు రీమల చందరరావు, బిజెపి కొయ్యూరు మండల ప్రధాన కార్యదర్శి కొర్ర త్రీనాథ్, బిజెపి నాయకులు కిల్లో రామ్, గెమ్మెలి రాజు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.