Breaking News

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తను పరామర్శించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు అబ్రహం.

0 19

 

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తను పరమర్శించిన దివంగత నేత మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ తనయుడు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం.

అనంతగిరి మండలం జీనబాడు గ్రామానికి చెందిన దేముడు గత కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అబ్రహం హుటాహుటిన గురువారం టిడిపి నేతలతో బయలుదేరి వెళ్ళి దేముడుని కలిసి పరామర్శించి మనోధైర్యాన్ని నింపి, నేను పార్టీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.