Breaking News

గిరిజన యువత చెడు మార్గంలో వెళ్ళకుండా కరాటే శిక్షణ ఇచ్చుటకు స్థలం కేటాయించాలని ఆంధ్ర రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కి వినతి.

0 19

 

గిరిజన యువత చెడు మార్గంలో వెళ్ళకుండా కరాటే శిక్షణ ఇచ్చుటకు స్థలం కేటాయించాలని ఆంధ్ర రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కి వినతి.

స్టూడెంట్స్ కోఫుకాన్ కరాటే క్లబ్ తరపున గత 15 సంత్సరాలు నుండి కరాటే  శిక్షణ ఇస్తున్నాను… రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలలో విద్యార్థులు మెడల్స్ సాధించారు.కరాటే అసోసియేషన్ ద్వారా విశాఖ మన్యం విద్యార్థులకు బ్లాక్ బెల్ట్స్ మాస్టర్స్ చే ఉద్యోగం అంశాలపై ప్రతి నెల రెండు సార్లు అవగాహన కలిపిస్తూ.. వాళ్ళు వెళ్లే రంగంవైపు ప్రోత్సహించి పంపిస్తున్నాము అని కొఫూకాన్ కరాటే క్లబ్ విశాఖ జిల్లా చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజు తెలిపారు. సీజన్ వారి వ్యాధులుపై,చెడు వ్యసనాలు పై, కోవిడ్ తీవ్ర ప్రభావం ఉన్న ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, కోవిడ్ సమయంలో అసోసియేషన్ ద్వారా 11 మండలాల పంచాయతీల పరిధిలో అవగాహన కార్యక్రమం చేశామన్నారు.. అసోసియేషన్ ద్వారా కరాటే శిక్షణ ఇస్తూ సేవా కార్యక్రమలు చేయటానికి స్థానికంగా ప్రభుత్వ స్థలము కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ST కమిషన్ చైర్మన్   కి కరాటే అసోసియేషన్ స్టూడెంట్స్ కోఫుకాన్ కరాటే క్లబ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా ద్వారా బాకూరు పాండురాజు కోరారు. 

Leave A Reply

Your email address will not be published.