విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో గిరిజన చట్టాలకు తూట్లు.
గిరిజనేతరులు యధేచ్ఛగా కడుతున్న అక్రమ కట్టడాలు.
చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు.
మండలంలోని బూధరాళ్ళ సెంటర్ వద్ద రాజబాబు అనే గిరిజనేతరుడు అక్రమ కట్టడం కడుతున్నాడని జేఏసీ నేతలు, గిరిజన సంఘాల నాయకులు మండల తాహశీల్దార్ కి తెలియజేసి అక్రమ కట్టడం నిలుపుదల చేయాలని వినతిపత్రం ఇచ్చినప్పటికీ అధికారులు మాత్రం నిలుపుదల చేయలేదు.
గిరిజన సంఘాల నాయకులు గొంతు చించుకోవడమే తప్పా ఫలితం మాత్రం శూన్యం.
ఇదే కనుక కొనసాగితే రానున్న ఐదు, పది ఏళ్లలో గిరిజన భూములను, స్థలాలను గిరిజనేతరులు పూర్తిగా వాళ్ల స్వాధీనంలో పెట్టుకుంటారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
సంబంధిత అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల గిరిజనేతరుడు అయిన రాజు బాబు స్లాబ్ వేసి మరీ బట్టల షాపు పెట్టుకుని వ్యాపారం కొనసాగిస్తున్నాడు.