Breaking News

కినపర్తిలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ కనక దుర్గ అమ్మవారి జాతర వేడుకలు.

0 21


 కినపర్తిలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ కనక దుర్గ అమ్మవారి జాతర వేడుకలు.

ఈరోజు విశాఖ జిల్లా,కొయ్యూరు మండలం, కినపర్తి పంచాయితీ,గ్రామంలో శ్రీ శ్రీ కనక దుర్గ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది.పంచాయితీ సర్పంచ్ రీమెల శ్రీనువాసు,మరియు యూత్ పర్యవేక్షణలో గురు భవాని పొట్టిక కిరణ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన సాంప్రదాయంగా పైడిపనుకుల మరియు చింతవానిపాలెం కోలాట బృందాలు పాల్గొన్నారు.అలాగే దింసా కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం ఉద్దేశించి స్థానిక సర్పంచ్ శ్రీనువాసు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అలాగే పండుగ సందర్భాల్లో కోడి పందాలు,పేకాట వంటి వాటికి దూరంగా ఉండాలని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఈరే మల్లిబాబు,గుడి పూజారి పొట్టిక వెంకట రమణ, యూత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.