Breaking News

ఎంపీపీ బడుగు రమేష్ ఆధ్వర్యంలో రెండవ సర్వసభ్య సమావేశం.

0 20

 విశాఖ జిల్లా, కొయ్యూరు మండలం:

మండల ఎంపీపీ బడుగు రమేష్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి శాంక్షన్ అయిన ప్రతీ పనిని, సంబంధిత పంచాయితీ పరిధిలోని ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని,అలా తెలియజేయటం వల్ల ప్రతీ పని నాణ్యతతో జరిపించుకోవడానికి వీలుగా ఉంటుందని అన్నారు.

ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కొయ్యూరు ఇన్చార్జ్ ఏఈ మొదటి సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదు ఈ సమావేశానికి కూడా హాజరు కాలేదు.

దీంతో ఈ సమస్యను ఎవరికి తెలియజేయాలో అర్ధం కాక ఎంపీపీ,జడ్పిటిసి,వైస్ ఎంపీపీ అలాగే ఎంపీడీవో అసహనం వ్యక్తం చేశారు.

ఎలక్ట్రికల్ ఏఈ కి మొదటి సమావేశానికి హాజరు కాలేదు, సెకండ్ సమావేశానికి అయినా హాజరు కావాలని ఫోన్ లో తెలియజేసానని,నేను కొయ్యూరు మండలానికి ఇంచార్జ్ మాత్రమే నని,నేను సమావేశాలకు రావాల్సిన అవసరం లేదని వెంటనే ఏఈ ఫోన్ పెట్టేసారని ఎంపీడీవో అన్నారు.

అగ్రికల్చర్ ఏఓ తో మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే పనిముట్లు పవర్ స్ప్రేయర్లు,టార్పలిన్ లు,పవర్ వీడర్ వంటివి ఎంత సబ్సిడీ తో వస్తున్నాయి,అనే వివరాలు రైతులకు ఖచ్చితంగా తెలియజేయాలని, దానివల్ల రైతులకు ఏం కావాలో అవి వారు తీసుకునే వీలుంటుందని ఎంపీపీ అన్నారు.


ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ తో వైస్ ఎంపీపీ వెంకట రమణ, ఎంపీటీసీ బిడిజన అప్పారావు మాట్లాడుతూ బి.కొత్తూరు గ్రామంలో ప్రభుత్వం నుండి రైతులకు ఇచ్చిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు మల్లీ తిరిగి ఇచ్చేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది అంటున్నారని,ఇది సరైన పద్ధతి కాదని అన్నారు.

ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు సర్వే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయకుండా జరిగాయని, అందుకే ఆర్ వో ఎఫ్ ఆర్ పట్టాలు పై అభ్యంతరాలు ఉన్నాయని, అందుకే ఆపు చేసామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మాట్లాడటం జరిగింది.

ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్ వో ఎఫ్ ఆర్ పట్టాలు ఇస్తే వాటిని వెనక్కి తిరిగి ఇచ్చేయాలని అనడం దారణమని డౌనూరు ఎంపీటీసీ అన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వారా నూకరాజు,తాహశీల్దార్ తిరుమల రావు, ఎంపీడీవో మేరీరోజ్, వైస్ ఎంపీపీ లు,ఎంపీటీసీలు, సర్పంచ్ లు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.