Breaking News

డుంబ్రిగుడ లో తెలుగుదేశం పార్టీ మండల సమావేశం.

0 20

 డుంబ్రిగుడ లో తెలుగుదేశం పార్టీ మండల సమావేశం.

విశాఖ జిల్లా:  ఈరోజు డుంబ్రిగుడ మండలంలో టిడిపి మండల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశ్యాలు:- పార్టీ యొక్క సిద్ధాంతలకు అనుగుణంగా నడవాలని, మండల పరిధిలో ఎలాంటి పార్టీ కార్యక్రమాలు చెయ్యాలి అనుకున్న అధ్యక్షులు వారికి ముందుగానే తెలియజేయాలి అన్నారు. పార్టీలో కొంతమంది నాయకులకు వారి వారి నడవడిక ప్రకారం పదవులు నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఎస్.సి, ఎస్టి కమిషన్ సభ్యులు సివేరి అబ్రహం,అరకు పార్లమెంట్ కోశాధికారి వంతల నాగేశ్వరావు,మండల పార్టీ అధ్యక్షులు తుడుము సుబ్బారావు,అరకు పార్లమెంట్ ఎస్ టి సెల్ ఉపాఅధ్యక్షులు కంబిడి సుబ్బారావు,అరకు పార్లమెంట్ టి ఎన్ టి యూ ప్రధాన కార్యదర్శి మండ్యాగురు స్వామి, డుంబ్రిగుడ మండల నాయకులు, పంచాయతీ నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.