Breaking News

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయిన స్పోర్ట్స్ ఫెస్ట్(వాలి బాల్ టోర్న మెంట్).

0 33

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయిన స్పోర్ట్స్ ఫెస్ట్(వాలి బాల్ టోర్న మెంట్).

ఈరోజు పాడేరు ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్) ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఏ.పి మెడికల్ కౌన్సిల్ సభ్యులు తమర్భ.నరసింగ రావు,ఏ. పి ట్రైకర్ ఛైర్మన్ సతక బుల్లి బాబు,కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వనుము.చిట్టబ్బయి పాల్గొని డాక్టర్ బీ ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం,రిబ్బన్ కట్ చేసి వాలీబాల్ టోర్న మెంట్ (స్పోర్ట్స్ ఫెస్ట్) ను ప్రారంబించారు,అనంతరం వారు మాట్లాడుతూ”ఆజాధికా అమృత మహోత్సవం” పేరుతో మన దేశనికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సంధర్బంగా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని,అదే పేరుతో మన మన్యంలో కూడా ఇలా క్రీడా ఉత్సవాలు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం శుభపరిణామం అని,యువత అందరూ దేశభక్తిని పెంపొందించుకుని,క్రీడా రంగంలో రానించాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియ జేశారు.ఏబీవీపీ నాయకులు కేవలం విద్యార్థి ఉద్యమాలే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ,అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర అధ్యక్షులు సంజీవరావు,జిల్లా ప్రముఖ్ ఎం ఎం ఏల్ పాత్రుడు, ఏబీవీపీ గిరిజన విద్యార్థుల విభాగం రాష్ట్ర కన్వీనర్ అంగనైని ఆనంద్,విభాగ్ కలమంచ్ కన్వీనర్ కళ్యాణ్, జిల్లా కన్వీనర్ రవికిరణ్ పాత్రుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భగవాన్, స్పోర్ట్స్ కన్వీనర్ రాంబాబు,ఏబీవీపీ కార్యకర్తలు వంశీకిరణ్, ఉపేంద్ర, ఆది, సంతోష్, సాయి వివిధ కళాశాలల క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



Leave A Reply

Your email address will not be published.