ఎంపిపి పాఠశాలను సందర్శించిన ఎంపీటీసీ.
విశాఖ జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు సెగ్మెంట్ ఎంపిటిసి బిడిజన అప్పారావు డి.నిమ్మలపాలెం ఎంపీపీ పాఠశాలను మంగళవారం సందర్శించారు. స్కూల్ పరిసరాలు, పిల్లల చదువు, మెనూ చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలను ఆహ్లాదకరం గా తీర్చిదిద్దుతున్న కుంచె మురళీ ని అభినందించారు. ఉపాధ్యాయుడు స్కూల్ కి బోర్ కావాలని అడగడంతో తాను ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి తీసుకువెళ్లి బోరు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పెట్లా గాంధీ, ఉల్లి రామ్మూర్తి, నీలాపు సూరిబాబు, వాలంటీర్ అంబటి నూకరాజు పాల్గొన్నారు.